తగ్గనున్న నగల డిమాండ్‌ : ఇక్రా

ABN , First Publish Date - 2022-08-17T06:22:28+05:30 IST

పసిడి నగల పరిశ్రమకు మళ్లీ అమ్మకాల భయం పట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎనిమిది శాతం,

తగ్గనున్న నగల డిమాండ్‌ : ఇక్రా

ముంబై: పసిడి నగల పరిశ్రమకు మళ్లీ అమ్మకాల భయం పట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎనిమిది శాతం, మూడో త్రైమాసికంలో 15 శాతం తగ్గే అవకాశం ఉందని ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దిగుమతి సుంకాలు, ధరల్లో ఆటుపోట్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. కొవిడ్‌ భయం తగ్గడం, పెళ్లిళ్లు, పండగల సీజన్‌తో గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నగల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయినా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో నగల అమ్మకాలు 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఇక్రా అంచనా. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌  అమ్మకాలు ఇందుకు ప్రధాన కారణం. వచ్చే పండగల సీజన్‌ కూడా పసిడి నగల అమ్మకాలకు కొద్దిగా కలిసొస్తుందని తెలిపింది. స్టోర్ల విస్తరణ కారణంగా సంఘటిత రంగంలోని జ్యుయలరీ సంస్థల ఆదాయాలు 14 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 

Updated Date - 2022-08-17T06:22:28+05:30 IST