కరోనా వైరస్ కొత్త రూపాంతరం డెల్టాక్రాన్ గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-09T23:34:49+05:30 IST

కరోనా వైరస్ కొత్త రూపాంతరం డెల్టాక్రాన్‌ను మధ్య

కరోనా వైరస్ కొత్త రూపాంతరం డెల్టాక్రాన్ గుర్తింపు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కొత్త రూపాంతరం డెల్టాక్రాన్‌ను మధ్య ప్రాచ్యంలోని సైప్రస్ దేశంలో గుర్తించారు. దీనికి డెల్టా వేరియంట్ వంటి జన్యు నేపథ్యం ఉంది. అదేవిధంగా దీనిలో ఒమైక్రాన్ రూపాంతరంలోని కొన్ని మ్యుటేషన్స్ కూడా ఉన్నాయి. అయితే దీని గురించి ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదు. ఆ దేశ మీడియా ఆదివారం ఈ వివరాలను వెల్లడించింది. 


సైప్రస్‌లో పరీక్షించిన 25 నమూనాలలో 10 ఒమైక్రాన్ మ్యుటేషన్స్ కనిపించాయి. ఈ వైరస్ సోకి, 14 మంది  సాధారణ వ్యక్తుల నుంచి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది నుంచి ఈ శాంపిల్స్‌ను సేకరించారు. 


సైప్రస్ విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ, మాలెక్యులార్ వైరాలజీ ల్యాబొరేటరీ అధిపతి డాక్టర్ లియోండియోస్ కొస్ట్రికిస్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్‌కు, హాస్పిటలైజేషన్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ వేరియంట్‌కు డెల్టా వేరియంట్ జన్యు నేపథ్యం, ఒమైక్రాన్ మ్యుటేషన్స్ కొన్ని ఉన్నట్లు తెలిపారు. 


సైప్రస్ ఆరోగ్య శాఖ మంత్రి మిఖలిస్ హడ్జిపండేలాస్ మాట్లాడుతూ, డెల్టాక్రాన్ వేరియంట్ గురించి ప్రస్తుతం ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ పరిశోధన వల్ల తమ దేశం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయ మ్యాప్‌లో కనిపిస్తుందన్నారు. దీనికి ఇప్పటి వరకు శాస్త్రీయ నామం పెట్టలేదు. 


Updated Date - 2022-01-09T23:34:49+05:30 IST