డెల్టా వేరియంట్ విజృంభణ: టోక్యో మొదలుకొని మలేషియా, థాయ్‌ల్యాండ్ వరకూ...

ABN , First Publish Date - 2021-08-01T16:15:36+05:30 IST

కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్ టోక్యో మొదలుకొని మలేషియా...

డెల్టా వేరియంట్ విజృంభణ: టోక్యో మొదలుకొని మలేషియా, థాయ్‌ల్యాండ్ వరకూ...

టోక్యో: కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్ టోక్యో మొదలుకొని మలేషియా, థాయ్‌ల్యాండ్ వరకూ విస్తరించింది. ఈ మూడు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. టోక్యోలోని మెట్రోపాలిటన్ సర్కారు తెలిపిన వివరాల ప్రకారం తాజాగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 4,058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి ముందు అత్యధికంగా నాలుగు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేవిధంగా మలేషియాలోనూ కరోనా కేసులు పెరిగాయి. 


కొత్తగా 17,786 కేసులు నమోదయ్యాయి. ఇక థాయ్‌ల్యాండ్ విషయానికొస్తే కొత్తగా 18,912 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో థాయ్‌ల్యాండ్‌లో కరోనా కారణంగా 178 మంది మృతి చెందారు. కాగా మలేషియాలో కరోనా విజృంభణను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపిస్తూ, ప్రజలు రోడ్లపైకివచ్చి ఆందోళనకు దిగారు. మలేషియాలో కరోనా బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదేవిధంగా చైనాలోనూ డెల్టా వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Updated Date - 2021-08-01T16:15:36+05:30 IST