జినోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు... భారీగా బయట పడుతున్న డెల్టా కేసులు!

ABN , First Publish Date - 2021-08-09T12:54:29+05:30 IST

గడచిన మూడు నెలలుగా ఢిల్లీ సర్కారు జినోమ్ సీక్వెన్సింగ్‌కు...

జినోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు... భారీగా బయట పడుతున్న డెల్టా కేసులు!

న్యూఢిల్లీ: గడచిన మూడు నెలలుగా ఢిల్లీ సర్కారు జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్న నమూనాలలో 80 శాతం నమూనాలు డెల్టావేరియంట్‌కు సంబంధించినవిగా నిర్థారణ అవుతున్నాయి. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలియజేసింది. ఢిల్లీలో జూలై నెలలో జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించిన నమూనాల్లో 83.3 శాతం నమూనాలు డెల్టా వేరియంట్(బీ.1.617.2)కు సంబంధించినవేనని తేలింది. 


ఇదేవిధంగా మేలో పంపిన నమూనాల్లో 81.7 శాతం, జూన్‌లో పంపిన నమూనాల్లో 88.6 శాతం నమూనాలు డెల్ట్ వేరియంట్ వేనని తేలింది. ఏప్రిల్‌లో జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన శాంపిల్స్‌లో 53.9 శాతం నమూనాలు డెల్టా వేరియంట్‌కు చెందినవిగా తేలింది. ఇప్పటి వరకూ ఢిల్లీ ఆరోగ్యశాఖ జినోమ్ సీక్వెన్సింగ్‌కు 5,752 నమూనాలు పంపగా, వాటిలో 1,689 నమూనాలు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నిర్థారణ అయ్యింది. కాగా ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరూ మృతి చెందలేదు. 

Updated Date - 2021-08-09T12:54:29+05:30 IST