యూరప్‌లో డెల్టా వేరియంట్‌ విజృంభణ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

ABN , First Publish Date - 2021-07-27T07:21:47+05:30 IST

ప్రపంచంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ చాలా దేశాల్లో కలకలం రేపుతోంది.

యూరప్‌లో డెల్టా వేరియంట్‌ విజృంభణ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

జెనీవా: ప్రపంచంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ చాలా దేశాల్లో కలకలం రేపుతోంది. తాజాగా యూరోపియన్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ విజృంభిస్తోందని, ఈ ప్రాంతంలో తాజా కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ వల్లే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. యూరప్‌లోని అత్యధిక భాగంలో ఈ వేరియంట్ కేసులు భారీగా నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జూన్ 28 నుంచి జూలై 11 వరకూ డేటాను పరిశీలిస్తే.. భారత్‌లో తొలిగా వెలుగు చూసిన ఈ వేరియంట్ మొత్తం 28 యూరోపియన్ దేశాల్లో 19 దేశాల్లో అధికంగా వ్యాపించినట్లు సమాచారం. ఈ 19 దేశాలకు సంబంధించిన శాంపిల్స్‌లో సగటున 68.3శాతం డెల్టా వేరియంట్ కేసులేనని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Updated Date - 2021-07-27T07:21:47+05:30 IST