132 దేశాల్లో డెల్టా వేరియంట్: అప్రమత్తతపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-07-31T14:17:38+05:30 IST

కరోనా వైరస్ కొత్త వేరియంట్లు, వ్యాక్సినేషన్‌లో జాప్యంపై...

132 దేశాల్లో డెల్టా వేరియంట్: అప్రమత్తతపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

జనీవా: కరోనా వైరస్ కొత్త వేరియంట్లు, వ్యాక్సినేషన్‌లో జాప్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వివిధ దేశాలను హెచ్చరించింది. అలాగే డెల్టా వేరియంట్ వ్యాప్తిపై కూడా హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ తప్ప కరోనా నుంచి తప్పించుకునేందుకు మరో ఉపాయం లేదన్నారు. 


డెల్టావేరియంట్ 132 దేశాల్లోకి ప్రవేశించిందని, భారత్‌లో ఈ వేరియంట్ తొలిసారిగా కనిపించిందన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. దీనిపై అప్రమత్తం అయ్యేలోగానే కొన్ని ప్రమాదకర వేరియంట్లు బయటపడుతున్నాయన్నారు. వీటిని అడ్డుకునేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ నాలుగు కొత్త వేరియంట్లను గుర్తించామన్నారు. ఈ వేరియంట్లను అడ్డుకోవడానికి ప్రజలంతా ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వెంటి లేషన్ బాగా ఉండే ప్రాంతాల్లో ఉండటం ఎంతో అవసరమన్నారు. 

Updated Date - 2021-07-31T14:17:38+05:30 IST