Delhi జూపార్కు పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-01T18:01:47+05:30 IST

కరోనా ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల తీవ్రతతో గత రెండు నెలలుగా మూసివేసిన ఢిల్లీ జంతుప్రదర్శనశాలను మంగళవారం పునర్ ప్రారంభించారు...

Delhi జూపార్కు పునర్ ప్రారంభం

న్యూఢిల్లీ: కరోనా ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల తీవ్రతతో గత రెండు నెలలుగా మూసివేసిన ఢిల్లీ జంతుప్రదర్శనశాలను మంగళవారం పునర్ ప్రారంభించారు. దీంతో జంతుప్రేమికులు జూపార్కు సందర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొన్నారు. ఈ ఏడాది జనవరి 4వతేదీన ఢిల్లీ జూపార్కును మూసివేశారు.జూపార్కు తెరవగానే రాత్రికి రాత్రే 4వేల టికెట్లు విక్రయించామని జూ అధికారులు చెప్పారు.జూపార్కు వద్ద కౌంటర్లను మూసిఉంచినందున రెండు మూడురోజుల పాటు సందర్శకులు ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకోవాలని అధికారులు కోరారు. జూపార్కును ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకు, మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు స్లాట్లలో సందర్శకులను అనుమతిస్తామని జూ అధికారులు చెప్పారు. రోజుకు 4వేల మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. జూపార్కును తెరిచినా కొవిడ్ సందర్శకులు కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని జూ పార్కు అధికారులు సూచించారు. 


Updated Date - 2022-03-01T18:01:47+05:30 IST