హైదరాబాద్ బ్యాటింగ్.. విలియమ్సన్ ఇన్
ABN , First Publish Date - 2020-09-30T00:51:27+05:30 IST
ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు వరుస పరాజయాలతో మంచి కసి
అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు వరుస పరాజయాలతో మంచి కసి మీద ఉన్న వార్నర్ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తుండగా, మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిన అయ్యర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీంతో ఇది మరో మంచి మ్యాచ్ కాగలదని అభిమానులు భావిస్తున్నారు.
హైదరాబాద్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. నబీ స్థానంలో కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడం కొంత శుభసూచకంగానే కనిపిస్తోంది. సాహా స్థానంలో అబ్దుల్ సమద్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక, ఢిల్లీ మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అవేశ్ ఖాన్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటివ్వడంతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా మార్చుకుంది.