Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో యువతిపై దాడి చేసిన దొంగ.. ఆమె ఎదురు తిరిగిన తీరుకు పోలీసులు ఫిదా!

ABN , First Publish Date - 2022-09-09T23:21:43+05:30 IST

రాత్రి సమయంలో ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.. హఠాత్తుగా ఆమెపై ఓ దొంగ దాడి చేశాడు..

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో యువతిపై దాడి చేసిన దొంగ.. ఆమె ఎదురు తిరిగిన తీరుకు పోలీసులు ఫిదా!

రాత్రి సమయంలో ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.. హఠాత్తుగా ఆమెపై ఓ దొంగ దాడి చేశాడు.. ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు.. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయంతో వణికిపోతారు.. కానీ, ఆ మహిళ అలా భయపడలేదు.. సివంగిలా ఎదురు తిరిగి ఆ దొంగకే చుక్కలు చూపించింది.. భయపడిన ఆ దొంగ ఆమెను వదిలేసి పారిపోయాడు.. ఆ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. 


దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో జరిగిన ఈ చోరీ సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఓ దొంగదాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె భయపడకుండా ఆ దొంగతో పోరాడింది. అతడిపై ఎదురుదాడికి దిగింది. ఆ దొంగ షర్ట్‌ పట్టుకుని కొట్టింది. అతడి నుంచి తన మొబైల్‌ ఫోన్‌ను తీసుకుంది. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌ని సేకరించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ (Viral Video) అవుతుంది.

Updated Date - 2022-09-09T23:21:43+05:30 IST