వైభవంగా ఢిల్లీ విజయోత్సవం

ABN , First Publish Date - 2021-07-25T05:43:18+05:30 IST

శతాబ్దాలుగా ఆచారంగా వస్తున్న ఢిల్లీ విజయోత్సవాన్ని సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో శనివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఢిల్లీ విజయోత్సవం
పల్లకిలో రామానుజాచార్యులు

సింహాచలం, జూలై 24: శతాబ్దాలుగా ఆచారంగా వస్తున్న ఢిల్లీ విజయోత్సవాన్ని సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా ఆషాఢ పౌర్ణిమ రోజున నిర్వహించే ఈ ఉత్సవం సందర్భంగా సాయంత్రం భక్తులకు దర్శనాలు నిలిపివేసిన తర్వాత పవళింపు సేవను గావించి, భగవద్రామానుజుల ఉత్సవమూర్తిని ప్రత్యేక పల్లకిలో ఆలయ బేడామండపంలోని హంసమూలన వేదికపై ఉంచారు. షోడశోపచారాలతో ప్రత్యేక సేవలు చేసి ఆలయ పారాయణదారులు, పండితులు ప్రబంధాలను పారాయణం చేశారు. మంగళాశాసనం, మంగళ నీరాజనాల తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం జరిపి రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని పల్లకిలో ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. ఈ విజయోత్సవంలో స్థానాచార్యులు డా.టిపి రాజగోపాల్‌, పురోహితులు కరి సీతారామాచార్యులు, అధ్యాపకులు సాతులూరి సూర్యనారాయణాచార్యులు, ఎన్‌కె రామానుజాచార్యులు, నండూరి తిరుమలాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:43:18+05:30 IST