ప్రతి జిల్లాలో మోడల్ పార్క్: Minister Gopal Rai

ABN , First Publish Date - 2022-05-07T02:06:36+05:30 IST

ప్రతి జిల్లాలో మోడల్ పార్క్: Minister Gopal Rai

ప్రతి జిల్లాలో మోడల్ పార్క్: Minister Gopal Rai

న్యూఢిల్లీ:  Delhi ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతి జిల్లాలో ఒక పార్కును ఢిల్లీ ప్రభుత్వం model parkలుగా అభివృద్ధి చేయనుందని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Environment Minister Gopal Rai) తెలిపారు. పెర్గోలాస్, ఫౌంటైన్లు, జాగింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, వైఫై వంటి సౌకర్యాలతో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. నగరంలో 16,828 పునరాభివృద్ధికి సంబంధించిన శాఖలు, ఏజెన్సీలతో మంత్రి రాయ్ సమీక్షించారు. పార్కులు, గార్డెన్స్ ఏర్పాటు, నిర్వహణ కోసం ఈ పథకం కింద ప్రభుత్వం రెసిడెంట్ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు ఎకరాకు రూ.2.55 లక్షలు అందిస్తుంది. నిర్వహణలో లేని పార్కులను గుర్తించేందుకు సర్వే జరుగుతోందని, ఇప్పటి వరకు దాదాపు 12,000 పార్కులను సర్వే చేశామని మంత్రి రాయ్ తెలిపారు. ఈ ఫైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక్కో పార్కును మోడల్ పార్క్‌గా అభివృద్ధి చేస్తోంది. పార్కుల్లో lighting, CCTV cameras, toilets, power backup వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. పునరాభివృద్ధి చేయబడిన పార్కుల్లో పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉంటాయని, పిల్లలకు అనుకూలమైన ఆట పరికరాలు ఉంటాయని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, వాటర్‌బాడీలు కూడా ఉంటాయని రాయ్ తెలిపారు.

Read more