ఢిల్లీలో రాష్ట్ర రైతులను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-02-15T16:26:14+05:30 IST

దక్షిణ భారత నదుల అనుసంధానం రైతు సమాఖ్య అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన వంద మంది రాష్ట్ర రైతులను రైల్వేస్టేషన్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అయ్యాకన్ను మాట్లాడుతూ, 2019

ఢిల్లీలో రాష్ట్ర రైతులను అడ్డుకున్న పోలీసులు

                             - రోడ్డుపై భైఠాయించి నిరసన


పెరంబూర్‌‘(చెన్నై): దక్షిణ భారత నదుల అనుసంధానం రైతు సమాఖ్య అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన వంద మంది రాష్ట్ర రైతులను రైల్వేస్టేషన్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అయ్యాకన్ను మాట్లాడుతూ, 2019 పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మోదీ, రైతుల ఆదాయం రెండింతలు చేసేలా వరి కిలో రూ.18 నుంచి రూ.54కు పెంచుతామని ఇచ్చిన హామీ ఇప్పటికి అమలుకు నోచుకోలేదన్నారు. అలాగే, చెరకు క్వింటాలుకు రూ.2,700 నుంచి రూ.8,100 పెంచు తామని చెప్పిన కేంద్రం, ప్రస్తుతం రూ.200 మాత్రమే పెంచిందన్నారు. ధాన్యం ధర నిర్ణయించే కమిషన్‌ కార్యాలయం ఢిల్లీలో ఉండడంతో, అక్కడకు వెళ్లి నిరసన తెలపాలని తమ సంఘం నిర్ణయించిందన్నారు. ఆ ప్రకారం తిరుచ్చి నుంచి బయల్దేరిన వంద మంది రైతులు సోమవారం ఉదయం ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోనే పోలీసులు అడ్డుకున్నారని, ఎన్ని నిర్భంధాలు ఎదురైనా తమ ఆందోళనలు కొనసాగిస్తామని అయ్యాకన్ను స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-15T16:26:14+05:30 IST