ఢిల్లీలో కొత్తగా 5,481 కోవిడ్ కేసులు, వారాంతపు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-04T23:54:36+05:30 IST

ఢిల్లీలో కొత్తగా 5,481 కోవిడ్ కేసులు, వారాంతపు కర్ఫ్యూ

ఢిల్లీలో కొత్తగా 5,481 కోవిడ్ కేసులు, వారాంతపు కర్ఫ్యూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,481 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ వల్ల ఇవాళ ముగ్గురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 8.37శాతంగా ఉంది. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుతో 168 మంది ఉండగా, వెంటిలేటర్లపై 14 మంది రోగులు ఉన్నారని వైద్య అధికారులు తెలిపారు. కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. అయితే దీనిని లాక్‌డౌన్‌గా పరిగణించకూడదని ఆయన అన్నారు. ఈ వారం నుంచి ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) మంగళవారం నిర్ణయించింది.


 కర్ఫ్యూ సమయంలో అవసరమైన వాటికి మాత్రమే అనుమతి ఉంటుందని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. 


అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2022-01-04T23:54:36+05:30 IST