కరోనా రిపోర్ట్: ఢిల్లీలో తాజాగా 1573 కేసులు

ABN , First Publish Date - 2020-07-13T00:35:16+05:30 IST

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. నిన్న 1800 వరకు నమోదైన కేసులు...

కరోనా రిపోర్ట్: ఢిల్లీలో తాజాగా 1573 కేసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. నిన్న 1800 వరకు నమోదైన కేసులు ఈ రోజు 1600కే పరిమితమయ్యాయి. ఈ రోజు కూడా కొత్త కేసులతో పోల్చితే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కుగానే ఉంది. కరోనాను నియంత్రించేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే కరోనాను అదుపుచేయగలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37 మంది మరణించారు. 2,276 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,12,494కి చేరింది. వీరిలో 19,155మంది చికిత్స పొందుతుండగా 89,968మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 3,371మంది మృత్యువాతపడ్డారు.




Updated Date - 2020-07-13T00:35:16+05:30 IST