10 అడుగుల మేర కుంగిన రోడ్డు... కూరుకుపోయిన బస్సు!

ABN , First Publish Date - 2021-09-14T15:27:55+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

10 అడుగుల మేర కుంగిన రోడ్డు... కూరుకుపోయిన బస్సు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టుప్రాంతాలు నీట మునుగుతున్నాయి. తాజాగా సౌత్ ఢిల్లీలోని అద్చిని ప్రాంతంలోని రోడ్డు 10 అడుగుల మేర కుంగిపోవడంతో ఒక బస్సు దానిలో కూరుకుపోయింది. ఆ సమయంలో అదే రోడ్డు మీద వెళుతున్న ఒక బైక్, స్కూటీ కూడా ఆ గొయ్యిలో పడిపోయాయి. 


దీనికి గమనించిన వెంటనే స్థానికులు ఆ వాహనదారులను కాపాడారు. అలాగే బస్సులో ఉన్న 30 మందికిపైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ రోడ్డు 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున కుంగిపోయింది. ఈ సమయంలో డీటీసీ బస్సు ఆ రోడ్డు మీదుగా వెళుతూ ఆ గొయ్యిలో పడిపోయింది. క్రేన్ సాయంతో ఆ బస్సును బయటకు తీశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే సోమనాథ్ భారతి, పోలీసులు, పీడబ్ల్యుూడీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-09-14T15:27:55+05:30 IST