Rajahmundry : నిన్న రాజమండ్రిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్(Delhi Public School)లోయూకేజీ చదువుతున్న ఓజశ్రీ (5) అనే చిన్నారి స్విమ్మింగ్ పూల్(Swimming Pool)లో పడి మృతి చెందింది. దీనిపై ఓజశ్రీ తండ్రి భార్గవ్ మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం స్కూల్ టైమ్ ముగిశాక.. తమ పాపను సిబ్బంది స్కూల్ బస్ ఎక్కించలేదన్నారు. క్లాస్‌రూమ్‌లో పాపపై కేర్ తీసుకోలేదని వాపోయారు. అడిగితే స్కూల్ సిబ్బంది పొంతనలేని సమాధానం చెప్పారని భార్గవ్ వెల్లడించారు. పాపకు కడుపునొప్పి వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లామంటూ.. బస్ డ్రైవర్‌తో తప్పుడు సమాచారం పంపారన్నారు. పాప మృతి చెందినా కనీసం సమాచారం ఇవ్వలేదని తండ్రి భార్గవ్ వెల్లడించారు.