Abn logo
May 23 2020 @ 06:24AM

816 మంది విదేశీ తబ్లీగ్ జమాత్ సభ్యులకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

న్యూఢిల్లీ : నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొని కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన 816 మంది విదేశాలకు చెందిన తబ్లీగ్ జమాత్ సభ్యులకు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. సీఆర్ పీసీ సెక్షన్ 41 ఎ కింద విదేశీ తబ్లీగ్ జమాత్ సభ్యులను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. విదేశాలకు చెందిన జమాత్ సభ్యులు ఇన్నాళ్లు క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. దీంతోపాటు దేశంలో 1900 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులకు పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ తోపాటు పలువురు నేతల పాస్ పోర్టుల రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement