పీఎంఓ అధికారినని చెప్పుకున్న వ్యక్తిపై కేసు నమోదు : ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2022-04-16T20:34:36+05:30 IST

ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారినని చెప్పుకున్న

పీఎంఓ అధికారినని చెప్పుకున్న వ్యక్తిపై కేసు నమోదు : ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారినని చెప్పుకున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫర్నిచర్ ఐటమ్స్ తయారీదారు ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ-మెయిల్ ఉత్తర, ప్రత్యుత్తరాలను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను పీఎంఓ, హోం మంత్రి కార్యాలయాలకు ట్యాగ్ చేశారు. 


ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఫర్నిచర్ ఐటమ్స్ తయారీదారు కుణాల్ మర్చంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. తనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీ వివేక్ కుమార్ ఓ ఈ-మెయిల్‌ను పంపించారని, ప్రధాని కోసం ప్రత్యేకంగా ఓ టేబుల్‌ను డిజైన్ చేయాలని కోరారని తెలిపారు.  

‘‘ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆఫీస్ బేరర్ ఫోర్జరీ, ఇంపెర్సనేషన్, ఐడెంటిటీ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు. 


ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ఉపయోగించుకోవడం కోసం ఎగ్జిక్యూటివ్ టేబుల్‌ను తయారు చేయాలని మర్చంట్‌ను వివేక్ కుమార్ కోరారని ఓ పోలీసు అధికారి చెప్పారు. ప్లాన్, డిజైన్ వర్క్ గురించి చర్చించడం కోసం సాధ్యమైనంత త్వరగా సంప్రదించాలని కోరుతూ ఓ ఫోన్ నంబరును కూడా ఈ-మెయిల్‌లో పేర్కొన్నారని తెలిపారు. అయితే రాజకీయ, సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల కుణాల్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారని, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి, కేసును నమోదు చేశామని చెప్పారు. తమ బృందం కుణాల్ మర్చంట్‌ను కూడా కాంటాక్ట్ చేసిందని, ఈ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2022-04-16T20:34:36+05:30 IST