Abn logo
Aug 6 2021 @ 14:55PM

ఎర్ర కోట పరిసరాల్లో భారీ కంటెయినర్లతో భద్రత

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సాధారణ ప్రజానీకాన్ని ఈ ప్రాంతంలోకి అనుమతించడంలేదు. ఎర్ర కోట ప్రధాన ద్వారం వద్ద దారికి అడ్డంగా భారీ కంటెయినర్లను ఏర్పాటు చేశారు. 


జనవరి 26న గణతంత్ర దినోత్సవాలనాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాల్లో భద్రతాపరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రసంగిస్తారు. దేశ రాజధాని నగరంలో స్వాతంత్ర్య దినోత్సవాలను భగ్నం చేయడానికి పాకిస్థాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. డ్రోన్లతో దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా హెచ్చరించాయి. 


ఇదిలావుండగా, కొద్ది రోజుల క్రితం ఎర్ర కోట వెనుకవైపు ఎగురుతున్న డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

జాతీయంమరిన్ని...