నుపుర్‌శర్మ,నవీన్ జిందాల్,జర్నలిస్ట్ సబానఖ్వీలపై ఢిల్లీ పోలీసుల కేసు

ABN , First Publish Date - 2022-06-09T14:20:37+05:30 IST

సోషల్ మీడియాలో విద్వేష పూరిత సందేశాలు చేశారని జర్నలిస్ట్ సబానఖ్వీతోపాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు....

నుపుర్‌శర్మ,నవీన్ జిందాల్,జర్నలిస్ట్ సబానఖ్వీలపై ఢిల్లీ పోలీసుల కేసు

social mediaలో విద్వేష పూరిత సందేశాలు...

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ద్వేషపూరిత సందేశాలకు సంబంధించి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఉద్వాసనకు గురైన బీజేపీ నేత నవీన్ జిందాల్, జర్నలిస్టు సబా నఖ్వీ తదితరులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.సోషల్ మీడియాలో విద్వేష పూరిత సందేశాలు చేశారని జర్నలిస్ట్ సబానఖ్వీతోపాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం నమోదు చేసిన పోలీసు కేసులో ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధిపతి నవీన్ కుమార్ జిందాల్, పీస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి షాదాబ్ చౌహాన్‌లు ఉన్నారు. 


జర్నలిస్టు సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్‌కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.విద్వేష వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై ఇదే విధమైన సెక్షన్ల కింద రెండవ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.మతాలకు అతీతంగా పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. సైబర్‌స్పేస్‌లో అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో సోషల్ మీడియా సందేశాలను పోలీసు యూనిట్ పరిశీలిస్తుందని మల్హోత్రా చెప్పారు.

Updated Date - 2022-06-09T14:20:37+05:30 IST