భారీ సంఖ్యలో పిల్లలు మాయం.. చిన్నారుల స్మగ్లింగ్ చేసే గ్యాంగ్.. వారిని ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2021-12-27T09:11:12+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నపిల్లలను అపహరించి.. వారిని విక్రయించే ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పదిమంది నేరస్తులతో కూడిన ఈ ముఠాలో ఆరుగురు మహిళలు...

భారీ సంఖ్యలో పిల్లలు మాయం.. చిన్నారుల స్మగ్లింగ్ చేసే గ్యాంగ్.. వారిని ఎలా పట్టుకున్నారంటే..

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నపిల్లలను అపహరించి.. వారిని విక్రయించే ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పదిమంది నేరస్తులతో కూడిన ఈ ముఠాలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. 9 మంది అరెస్టు కాగా.. ఈ గ్యాంగ్ నాయకురాలు ఇంకా పరారీలో ఉంది.


ఇప్పటివరకు ఈ ముఠా 50కు పైగా పిల్లలను విక్రయించిందని పోలీసులు చెప్పారు. ముఖ్యంగా నెలల వయసు గల పిల్లలనే వారు టార్గెట్ చేసేవారని... ఒక్కొక్క చిన్నారిని రెండు నుంచి మూడు లక్షల రూపాలకు ఈ గ్యాంగ్ విక్రయిచేవారని పోలీసుల విచారణలో తెలిసింది. 


పోలీసులు కథనం ప్రకారం.. డిసెంబర్ 17న ఢిల్లీ క్రైం విభాగానికి చెందిన పోలీసులకు చిన్న పిల్లలను అక్రమంగా విక్రయించే కొందరు దుండగులు గాంధీ నగర్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసుల బృందం రంగంలోకి దిగి మగ్గురు మహిళలను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి ఒక వారం రోజుల పసికందుని స్వాధీనం చేసుకుంది. ఆ ముగ్గురు మహిళా నేరస్తులను పోలీసుల ప్రశ్నించగా.. వారు ముఠా నాయకురాలు ప్రియంకా గురించి, మిగతా సభ్యుల గురించి చెప్పారు.


గ్యాంగ్ ఎలా పనిచేస్తుందంటే..

సంతానం లేని దంపతుల గురించి ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకొని వారిని ఈ ముఠా సభ్యులు సంప్రదించేవారు. వారికి ఎలాంటి పిల్లలు కావాలో తెలుసుకొని.. చిన్నపిల్లలు ఉన్న పేద తల్లిదండ్రులను టార్గెట్ చేసేవారు. ఆ పేదవారికి కేవలం రూ.20,000 నుంచి రూ.25,000 చెల్లించి వారి వద్ద నుంచి పిల్లలు కొనేవారు. పిల్లలు బాగా డిమాండ్ ఉన్న సమయంలో చిన్నారులను దొంగలించేవారు. 


కొందరు సంతానం లేని దంపతులు చట్టపరంగా పిల్లలు దత్తత తీసుకునేందుకు ఇబ్బందులు ఉండడంతో.. ఈ పిల్లల స్మగ్లింగ్ గ్యాంగ్‌ను ఆశ్రయించేవారు. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-27T09:11:12+05:30 IST