Abn logo
Jul 31 2021 @ 11:41AM

most wanted: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ అరెస్ట్

న్యూఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, కరడు కట్టిన నేరగాడు కాలా జతేడిని ఢిల్లీ స్పెషల్ పోలీసు సెల్ అరెస్టు చేసింది. పలు నేరాల్లో నిందితుడైన కాలా జతేడి తలపై రూ.7లక్షల రివార్డు ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ కు చెందిన కాలాను అరెస్టు చేశామని ఢిల్లీ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ సెల్ డీసీపీ మనీష్ చంద్ర చెప్పారు. కాలాకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడ్డాడని డీసీపీ చెప్పారు. ఈ ఏడాది మే నెలలో కాలా గ్యాంగుకు చెందిన మొహిత్ గిల్(24)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.కాలా ముఠా సభ్యుడైన మొహిత్ గిల్ రోహతక్ ప్రాంత వాసి అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.