Abn logo
Oct 22 2020 @ 14:22PM

వృద్ధుడిని దోచుకున్న ఇద్దరు మహిళల అరెస్ట్

Kaakateeya

న్యూఢిల్లీ : ఓ వృద్ధుడిని దోచుకున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. 62 ఏళ్ల ఓ వృద్ధుడు బ్యాంకులో రూ.50వేలు డ్రా చేసి లెక్కబెట్టుకుంటుండగా ఇద్దరు మహిళలు చూశారు. ఇద్దరు మహిళలు వృద్ధుడిని అనుసరించి అతని బ్యాగులో నుంచి రూ.50వేల డబ్బును దోచుకెళ్లారు.సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు మహిళలు దోచుకున్నారని తేలడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ ఘడ్ జిల్లాకు చెందిన రేణు(36), జ్యోతి (34)లు దోపిడీకి పాల్పడ్డారని తేలడంతో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

పుష్పక్ విహార్ వద్ద ఖోఖా మార్కెటులో ఎన్ బీసీసీ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు కనిపించగా వారిని అరెస్టు చేశామని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ చెప్పారు. మహిళల నుంచి రూ.20వేలను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారని, వారిలో కాళీ అనే మరో మహిళ తన వాటా చోరీ డబ్బు తీసుకొని స్వస్థలం వెళ్లిందని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement