Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 5 2021 @ 14:57PM

ఢిల్లీలో ఒమైక్రాన్ తొలి కేసు నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ తొలి కేసు ఆదివారంనాడు నమోదైంది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన 37 ఏళ్ల యువకుడిలో ఈ వైరస్ కనుగొన్నారు. వెంటనే అతనిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. దీంతో దేశంలో ఒమైక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మీడియాకు ఈ విషయం తెలియజేశారు. ఇంతవరకూ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన 17 మంది ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు ఆయన చెప్పారు. 12 శాంపిళ్లను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపామని, ఒకరిలో ఒమైక్రాన్ వేరియంట్ కనిపించిందని, భారతదేశానికే చెందిన అతను కొద్దిరోజుల క్రితమే టాంజానియా నుంచి తిరిగి వచ్చినట్టు తెలిపారు. ఏయో ప్రదేశాల్లో అతను పర్యటించాడో తెలుసుకుని, ఎవరెవరిని కాంటాక్ట్ చేశాడనే వివరాలను సేకరిస్తున్నామని అన్నారు.

కాగా, ఒమైక్రాన్ మొదటి రెండు కేసులు కర్ణాటకలో గత గురువారంనాడు నమోదయ్యాయి. 66 ఏళ్ల సౌత్ ఆఫ్రికా ఫ్లయర్‌తో పాటు ట్రావెల్ హిస్టరీ లేని 46 ఏళ్ల బెంగళూరు డాక్టర్‌‌‌లో ఒమైక్రాన్ కనుగొన్నారు. వీరిద్దరూ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం విశేషం. గత శనివారంనాడు గుజరాత్‌కు చెందిన 72 ఏళ్ల ఎన్‌ఆర్ఐతో పాటు మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల యువకుడికి వైద్య పరీక్షల్లో ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులను ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రులో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement