ఢిల్లీ ప్రభావాన్ని నివారించేది ఎలా?

ABN , First Publish Date - 2020-04-03T03:11:18+05:30 IST

మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే 600 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతావారిని పట్టుకునే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ..

ఢిల్లీ ప్రభావాన్ని నివారించేది ఎలా?

హైదరాబాద్: మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే 600 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతావారిని పట్టుకునే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నఏవిధంగా జరుగుతోంది. సోషల్ ట్రేసింగ్ అంత ఈజీగా సాధ్యమవుతుందా? అనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎక్స్‌పర్ట్  డాక్టర్ జయంతిరెడ్డి, జనరల్ ఫిజిషియన్, డైబటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్, సామాజిక వేత్త రేవతిగౌడ్ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా డాక్టర్ జయంతిరెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన దేశాలను ఉదాహరణగా తీసుకోవాలి. కోరియాలో ఓ మహిళకు కరోనా వచ్చింది. ఆమె చర్చికి వెళ్లడంతో 1500 మందికి సోకింది. ఈ 1500 మందిని కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించారు. ఒక్కసారిగా ఈ వైరస్ అంటుకున్న తర్వాత ఆరున్నర రోజులుకు లక్షణాలు బయటపడతాయి. వైరస్ సోకిన రెండు రోజుల నుంచే వ్యాప్తి చెందుతుంది. విదేశాల నుంచి వాళ్లకు థర్మల్ టెస్టు చేసినా కరోనా బయటపడే అవకాశం లేదు.’’ అని అన్నారు. 



Updated Date - 2020-04-03T03:11:18+05:30 IST