కరోనా ఎఫెక్ట్: లక్షకు చేరువలో రాజధాని.. ఈ రోజు ఎన్నంటే..

ABN , First Publish Date - 2020-07-04T03:14:54+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇటీవల కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా 2 వేల నుంచి ..

కరోనా ఎఫెక్ట్: లక్షకు చేరువలో రాజధాని.. ఈ రోజు ఎన్నంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇటీవల కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా 2 వేల నుంచి 3 వేల మధ్య మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా 2,500పైన మాత్రమే కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య  శాఖ నేడు ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,520 కరోనా కేసులు నమోదయ్యాయి. 59 మంది మరణించారు. 2,617 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,695కి చేరింది. వీరిలో 26,148మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 65,624మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2,923మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లక్ష కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఢిల్లీ నిలవనుంది. దాదాపు 2లక్షల కేసులతో మమారాష్ట్ర ముందుండగా, తమిళనాడు ఈ రోజే లక్ష మార్కు దాటేసింది. త్వరలో ఈ జాబితాలో ఢిల్లీ  కూడా చేరనుంది.




Updated Date - 2020-07-04T03:14:54+05:30 IST