రక్షాబంధన్: మెట్రోలో అదనపు సేవలు.. బస్సుల్లో ఉచిత ప్రయాణాలు!

ABN , First Publish Date - 2021-08-22T11:53:13+05:30 IST

ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి.

రక్షాబంధన్: మెట్రోలో అదనపు సేవలు.. బస్సుల్లో ఉచిత ప్రయాణాలు!

న్యూఢిల్లీ: ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మెట్రో టైమింగ్‌లో మార్పులు చేసింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పింక్ లైన్‌పై మెట్రో సేవలు ఉదయం 6:30కే ప్రారంభం కానున్నాయి. రెడ్‌లైన్‌లో ఉదయం 5:30 నుంచే మెట్రో సేవలు మొదలుకానున్నాయి. మెట్రో ప్రయాణీకులు కోచ్‌లలోని అన్ని సీట్లలో కూర్చోవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణం సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సివుంటుందన్నారు. 


హరియాణా ప్రభుత్వం రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి మనోహల్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని తెలిపారు. 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. యూపీ యోగి సర్కారు కూడా మహిళలు ఈరోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఇదేవిధంగా ఈరోజు వీకెండ్ లాక్‌డౌన్ సడలిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-08-22T11:53:13+05:30 IST