ఢిల్లీలో మళ్లీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి, ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా

ABN , First Publish Date - 2022-04-20T19:58:13+05:30 IST

ఢిల్లీలో మళ్లీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి, ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా

ఢిల్లీలో మళ్లీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి, ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా

న్యూఢిల్లీ: మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మాస్క్‌లను న్యూఢిల్లీలో మరోసారి విధిగా ధరించాలని, మాస్క్ ధరించకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలు భౌతిక తరగతులను కొనసాగిస్తాయని అధికారులు నిర్ణయించారు. అయితే మెరుగైన నిర్వహణ కోసం ఎస్‌వోపీలు జారీ చేయాలని, సామాజిక సమావేశాలపై నిషేధం ఉండదు కానీ అన్ని రకాలపై నిశిత పరిశీలన ఉంటుందని పేర్కొంది. మంగళవారం ఢిల్లీలో 4.42 శాతం పాజిటివ్ రేటుతో 632 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజువారీ సంఖ్య 501 కాగా, పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉంది. ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది.

Updated Date - 2022-04-20T19:58:13+05:30 IST