liquor shortage: ఢిల్లీలో 468 దుకాణాల మూసివేత...కొత్త ఎక్సైజ్ పాలసీతో మద్యం కొరత

ABN , First Publish Date - 2022-08-01T13:43:25+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో( delhi) సోమవారం నుంచి తీవ్ర మద్యం కొరత(liquor shortage)...

liquor shortage: ఢిల్లీలో 468 దుకాణాల మూసివేత...కొత్త ఎక్సైజ్ పాలసీతో మద్యం కొరత

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో( delhi) సోమవారం నుంచి తీవ్ర మద్యం కొరత(liquor shortage) ఏర్పడింది. జులై 31వతేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వతేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ(new liquor policy in delhi) అమలుతో ఢిల్లీలో 468 ప్రైవేటు మద్యం దుకాణాలను సోమవారం నుంచి మూసివేశారు. దీంతో మద్యం తీవ్ర కొరత ఏర్పడటంతో(liquor shortage in delhi) మద్యంప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

మద్యంప్రియులకు భారీ డిస్కౌంట్లు

2021-22 వ ఎక్సైజ్ సంవత్సరం జులై 31వతేదీతో ముగియడంతో చివరి రెండు రోజులు తమ వద్ద నున్న మద్యం నిల్వలను విక్రయించడానికి మద్యం దుకాణాల యజమానులు భారీ డిస్కౌంట్లు( offered heavy discounts) ఇచ్చారు. ఒక మద్యం బాటిల్ కొంటే మరో బాటిల్ ఉచితంగా(one plus one free) ఇచ్చారు. కొన్ని మద్యం దుకాణాల వారైతే ఒక బాటిల్ కొంటే రెండు బాటిళ్లను ఉచితంగా ఆచ్చారు. దీంతో చివరి రెండు రోజుల్లో మద్యంప్రియులు మద్యం కొనేందుకు బారులు తీరారు. 



కొత్త ఎక్సైజ్ పాలసీ

కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం స్టోర్లలోనే మద్యాన్ని విక్రయిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. కొత్తగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించే వరకు అక్రమ మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. మద్యం సరఫరాలో లోపాలను సవరిస్తూ సీబీఐ దర్యాప్తులో చేసిన సిఫార్సుల మేర ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించింది. 

Updated Date - 2022-08-01T13:43:25+05:30 IST