కేజ్రీవాల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఎల్జీ

ABN , First Publish Date - 2022-01-21T20:04:01+05:30 IST

వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, కోవిడ్ ఆంక్షలను సడలించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి..

కేజ్రీవాల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఎల్జీ

న్యూఢిల్లీ: వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, కోవిడ్ ఆంక్షలను సడలించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ శుక్రవారంనాడు తోసిపుచ్చారు. అయితే, 50 శాతం సామర్థ్యంతో ప్రైవేటు ఆఫీసులు తిరిగి పనిచేసేందుకు గవర్నర్ సమ్మతి తెలిపారు.


''ప్రైవేటు కాలేజీలు 50 శాతం సామర్థ్యంలో తిరిగి పనిచేసేందుకు అంగీకరిస్తున్నాను. కానీ, కోవిడ్ పరిస్థితులు మెరుగయ్యేంత వరకూ వీకెండ్ కర్ఫ్యూలు, మార్కెట్లు తెరవడంపై తీసుకున్న నిర్ణయం యథాతథంగా కొనసాగించాలని సూచిస్తున్నాను'' అని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి ముందు ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ కేసులు తగ్గుతున్నందున ఆంక్షలు సడలించాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు ఎల్‌జీ అనుమతి కోరింది. కాగా, ఢిల్లీలో గురువారం 12,306 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 43 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివిటీ రేటు 21.48కి తగ్గింది.

Updated Date - 2022-01-21T20:04:01+05:30 IST