కాలుష్య రాజధానిగా ఢిల్లీ

ABN , First Publish Date - 2022-03-22T21:46:37+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన దేశ రాజధానిగా నిలిచింది ఢిల్లీ. 2021కి సంబంధించి ‘ఐక్యూ ఎయిర్’ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ‘ప్రపంచ వాయు కాలుష్య నివేదిక’ రూపొందించింది.

కాలుష్య రాజధానిగా ఢిల్లీ

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన దేశ రాజధానిగా నిలిచింది ఢిల్లీ. 2021కి సంబంధించి ‘ఐక్యూ ఎయిర్’ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ‘ప్రపంచ వాయు కాలుష్య నివేదిక’ రూపొందించింది. 117 దేశాల్లోని 6,475 నగరాల్లో ఉన్న వాయుకాలుష్య పరిశీలన కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ‘ఐక్యూ ఎయిర్’ కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవడం వరుసగా ఇది నాలుగోసారి. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఢాకా (బంగ్లాదేశ్), ఉంజమెనా (చాద్), దుషాన్బే (తజకిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. అలాగే అత్యంత వాయు కాలుష్యం కలిగిన 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు కాలుష్య ప్రమాణం 5 మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. దేశంలోని ప్రధాన నగరాలేవీ ఈ ప్రమాణాలకు దగ్గరలేవని కూడా నివేదిక వెల్లడించింది. దాదాపు 48 శాతం నగరాల్లో సగటు వాయు కాలుష్యంకంటే ఎక్కువగానే ఉంది. నగరాల్లో నివసిస్తున్నప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని, వాహనాల నుంచి వెలువడే విష వాయువులే ప్రధానంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.

Updated Date - 2022-03-22T21:46:37+05:30 IST