నిజమైన హామీలిచ్చి శారీరకంగా కలిస్తే అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2022-04-09T23:56:51+05:30 IST

యువతిపై అత్యాచారానికి సంబంంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివాహం చేసుకుంటానని నిజాయితీగా వాగ్దానం చేసి, శారీరకంగా కలిశాక పెళ్లి జరగకపోతే అది అత్యాచారం కిందకు రా

నిజమైన హామీలిచ్చి శారీరకంగా కలిస్తే అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు

ఇంటర్నెట్ డెస్క్: యువతిపై అత్యాచారానికి సంబంంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివాహం చేసుకుంటానని నిజాయితీగా వాగ్దానం చేసి, శారీరకంగా కలిశాక పెళ్లి జరగకపోతే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తోసుపుచ్చింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఢిల్లీకి చెందిన యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో సదరు యువతి ఆ యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను మానభంగం చేశాడని ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు యువతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సదరు యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 



సదరు యువతితో తన క్లైంట్ శారీరకంగా కలవలేదని పేర్కొన్నారు. మొదటి నుంచి తన క్లైంట్ సంపాదన, వృత్తిపై సదరు యువతి అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. వివాహ స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు వొచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వివాహం ఆగిపోయిందని.. దీంతో సదరు యువతి తన క్లైంట్‌పై అత్యాచార ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సంచలన తీర్పు చెప్పింది. నిజమైన హామీలిచ్చి శారీరంగా కలిస్తే అది అత్యాచారం కిందకు రాదని పేర్కొంది. వివాహం చేసుకుంటానని నిజాయితీగా వాగ్దానం చేసి, శారీరకంగా కలిశాక పెళ్లి జరగకపోతే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 




Updated Date - 2022-04-09T23:56:51+05:30 IST