న్యూఢిల్లీ, జనవరి 14: ఇష్టం లేని శృంగారంపై సెక్స్ వర్కర్ కన్నా భార్యకు హక్కు తక్కువగా ఉంటుందా? బలవంతంపు సంభోగం వద్దని చెప్పే హక్కు భార్యకు ఉండదా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. వైవాహిక అత్యాచారాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సమ్మతి లేకుండా సెక్స్ వర్కర్‌తో సంభోగించడంలో అత్యాచార చట్టం ఎలాం టి మినహాయింపునివ్వదని, ఈ విషయంలో భార్యకు ఉండే హక్కులను ఎందుకు కాలరాయాలని జస్టిస్ హరి శంకర్ వ్యాఖ్యానించారు. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గురువారం కోర్టుకు కేంద్రం తెలిపింది.