ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జీల విచారణ

ABN , First Publish Date - 2020-03-26T16:45:55+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జడ్జీలు ఇంటి నుంచే అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారించారు.....

ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జీల విచారణ

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జడ్జీలు ఇంటి నుంచే అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో కజకస్థాన్ దేశంలోని అల్‌మటీ విమానాశ్రయంలో 300 మంది భారత విద్యార్థులు ఆహారం, వైద్య సహాయం లేకుండా అవస్థలు పడుతున్నారని ఢిల్లీ హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషనుపై జస్టిస్ సిద్ధార్థ మృదుల, జస్టిస్ తల్వంత్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారణ జరిపింది. ఈ కేసులో జడ్జీలు, న్యాయవాదులు ఇంటి నుంచే వీడియో,వాట్సాప్ మల్టీ కాన్ఫరెన్స్ ద్వార అత్యవసర కేసును విచారించారు. ఈ కేసులో భారత విద్యార్థులకు వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ హైకోర్టు జడ్జీలు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించారు.


కజకిస్థాన్ దేశంలోని సీమే మెడికల్ యూనివర్శిటీలో చదువుకునేందుకు 300 మంది విద్యార్థులు వెళ్లారని, కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వారికి ఆహారం నీళ్లు, రవాణ, వైద్య సదుపాయాలు అందటం లేదని సెహ్లా సైరా ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై న్యాయవాది ఫోజియా రహమాన్ వాదనలు వినిపించారు. ఓ వైద్యవిద్యార్థిని తల్లి అయిన సైరా వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖకు నోటీసు జారీ చేసింది. 

Updated Date - 2020-03-26T16:45:55+05:30 IST