జర్నలిస్ట్ జుబెయిర్ పిటిషన్‌పై పోలీసులకు Delhi High Court నోటీసు

ABN , First Publish Date - 2022-07-01T23:43:56+05:30 IST

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్

జర్నలిస్ట్ జుబెయిర్ పిటిషన్‌పై పోలీసులకు Delhi High Court నోటీసు

న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్ (Mohammed Zubair)  దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓ హిందూ దేవునిపై 2018లో ఆయన ఇచ్చిన ట్వీట్‌పై నమోదైన కేసులో ఆయనను పోలీస్ రిమాండ్‌కు ఆదేశించడాన్ని ఆయన ఈ పిటిషన్‌లో సవాల్ చేశారు. 


జుబెయిర్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ట్రయల్ కోర్టు జూన్ 28న ఆదేశాలు ఇచ్చింది. దీనిని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ సంజయ్ నరులా విచారణ జరిపారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. 


జుబెయిర్ ఇచ్చిన ఓ ట్వీట్ మతపరమైన మనోభావాలను గాయపరిచేవిధంగా ఉందని ఆరోపిస్తూ ఓ ట్విటర్ యూజర్ చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ, ఢిల్లీ పోలీసులు ఆయనను జూన్ 27న అరెస్టు చేశారు. ఆయనను ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ట్రయల్ కోర్టు అదే రోజు ఆదేశాలు ఇచ్చింది. ఆ మర్నాడు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా సమక్షంలో ఆయనను హాజరుపరచగా, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించారు. 


ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం జుబెయిర్‌ను జూలై రెండున కోర్టులో హాజరుపరచవలసి ఉంది. 


Updated Date - 2022-07-01T23:43:56+05:30 IST