Jun 4 2021 @ 19:22PM

జూహీ చావ్లాకు కోర్టు షాక్.. జరిమానా

బాలీవుడ్ నటి, పర్యావరణ వేత్త జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్ట్ షాకిచ్చింది. 5 జీ టెక్నాలజీని అమలు చేస్తే పర్యావరణం దెబ్బ తినే అవకాశం ఉందంటూ జూహీ, వీరేశ్ మాలిక్, టీనా వచానీ కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసు కేవలం ప్రచారం కోసమే వేసినట్లు ఉందని కోర్టు సంబంధితులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా రూ.20 లక్షల జరిమానాను విధించింది. 5జీ టెక్నాలజీ కారణంగా రేడియన్ 10 నుంచి 100 రెట్లు పెరుగుతుందని జూహీ చావ్లా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ కోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేసింది. విచార‌ణ సమ‌యంలో చాలా మంది జూహీ అభిమానులు అంత‌రాయం క‌లిగించారు. కోర్టు కేసు విచార‌ణ‌ను వాయిదా వేసింది. శుక్ర‌వారం విచార‌ణ చేసిన కోర్టు.. కేవ‌లం ప్రచారం కోస‌మే ఈ పిటిష‌న్ వేశార‌ని పేర్కొంది. న్యాయ ప్ర‌క్రియ‌ను అవ‌హేళ‌న చేసినందుకు పిటిష‌న‌ర్ల‌కు రూ.20 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తున్న‌ట్లు కోర్టు తీర్పునిచ్చింది.

Bollywoodమరిన్ని...