Abn logo
Oct 23 2020 @ 07:13AM

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బహుమతి

Kaakateeya

న్యూఢిల్లీ : దసరా పండుగ సందర్భంగా ఢిల్లీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది. 2018-21 సంవత్సరాలకు గాను ఎల్టీసీకి సమానమైన నగదును ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2021 మార్చి 31వరకు ఏదైనా ముఖ్యమైన పండుగలకు ముందస్తు ప్యాకేజీని అందిస్తామని ఆప్ సర్కారు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్త లాక్ డౌన్ వల్ల రవాణ, హోటళ్లు మూతపడటంతో ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఎల్టీసీ ప్రయాణాలు చేయలేదు.దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీకి సమానమైన నగదును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. బిజినెస్ క్లాస్  విమానచార్జీలకు అర్హత ఉన్న ఉద్యోగులకు రూ.36వేలు, ఎకానమీ క్లాస్ విమానచార్జీలకు అర్హత ఉన్న వారికి రూ.20వేలు, రైలు చార్జీలకు అర్హత ఉన్న వారికి రూ.6వేలు చొప్పున ఎల్టీసీని బహుమతిగా ఇవ్వనున్నారు. 

Advertisement
Advertisement