Delhi: కొవిడ్ టీకా తీసుకోని టీచర్లకు పాఠశాలలోకి నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-10-09T12:55:34+05:30 IST

కొవిడ్ టీకాల విషయంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

Delhi: కొవిడ్ టీకా తీసుకోని టీచర్లకు పాఠశాలలోకి నో ఎంట్రీ

ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల విషయంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఈ నెల 15వతేదీలోగా కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి పాఠశాలల్లో ప్రవేశం లేదని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. టీకాలు తీసుకోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి పాఠశాలలోకి ఎంట్రీ లేదని, వారికి సెలవుగా పరిగణించాలని ఢిల్లీ ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, స్కూలు బస్సుల డ్రైవర్లకు ఈ నెల 15వతేదీలోగా టీకాలు వేయించాలని విద్యాశాఖ డైరెక్టర్ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.


కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారు కోరింది.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1500 ఉన్నాయి. పాఠశాలల్లో పనిచేసే వారందరూ కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, లేదంటే వారిని స్కూళ్లలోకి అనుమతించమని, వారికి సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.పాఠశాలలకు వెళ్లే పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా టీకాలు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షురాలు అపరాజిత గౌతమ్ చెప్పారు. 

Updated Date - 2021-10-09T12:55:34+05:30 IST