8 వరకూ పరీక్షలొద్దు... ప్రమోట్ చేయండి: ప్రభుత్వ ఆదేశం!

ABN , First Publish Date - 2021-02-25T12:00:30+05:30 IST

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లలో...

8 వరకూ పరీక్షలొద్దు... ప్రమోట్ చేయండి: ప్రభుత్వ ఆదేశం!

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లలో విద్యాసంవత్సరం 2020-21లో మూడవ తరగతి మొదలుకొని 8 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ పరీక్షలు ఉండవు. ఈసారి ఈ తరగతుల విద్యార్థులకు అందించిన వర్క్‌షీట్, అసైన్‌మెంట్‌ల ఆధారంగా వారికి మార్కులు(గ్రేడు) వేయనున్నారు. ఇదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం 2020-21లో నర్సరీ మొదలుకొని 2వ తరగతి వరకూ చదువున్న విద్యార్థుందరినీ తదుపరి తరగతులకు నేరుగా ప్రమోట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 8వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరినీ డిస్టెన్స్ పాలసీ ఆధారంగా తదుపరి తరగతులకు ప్రమోట్ చేయనున్నమన్నారు. అయితే ఈ ఏడాది సెమీ ఆన్‌లైన్ క్లాసులలో ఏమి నేర్చుకున్నారనేది తెలుసుకోవాలని, ఇది తాము తదుపరి విద్యాసంవత్సరాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందన్నారు. 



Updated Date - 2021-02-25T12:00:30+05:30 IST