ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో హుక్కాపై నిషేధం

ABN , First Publish Date - 2020-08-04T15:23:20+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హుక్కాలపై ఢిల్లీ సర్కారు నిషేధాస్త్రం విధించింది....

ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో హుక్కాపై నిషేధం

ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హుక్కాలపై ఢిల్లీ సర్కారు నిషేధాస్త్రం విధించింది. ఢిల్లీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్, పబ్‌లలో హుక్కా పీల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. హుక్కా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఏర్పడనున్న నేపథ్యంలో వీటిని నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విక్రం దేవ్ దత్ చెప్పారు. పొగాకుతో పొగాకు లేకుండా హుక్కాల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-08-04T15:23:20+05:30 IST