రూ.154 కోట్ల జరిమానా, 37 వేల కేసులు.. ఎక్కడ..? ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-04-09T20:58:15+05:30 IST

పోలీసులు అక్కడి ప్రజలపై 37వేల కేసులు పెట్టారు. అంతేకాకుండా ఏకంగా రూ.154కోట్ల జరిమానా విధించారు. ఏంటి ఈ సంఖ్యలు చూసి షాకవుతున్నారా? రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల జరిమానాలు

రూ.154 కోట్ల జరిమానా, 37 వేల కేసులు.. ఎక్కడ..? ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పోలీసులు అక్కడి ప్రజలపై 37వేల కేసులు పెట్టారు. అంతేకాకుండా ఏకంగా రూ.154కోట్ల జరిమానా విధించారు. ఏంటి ఈ సంఖ్యలు చూసి షాకవుతున్నారా? రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల జరిమానాలు అలాగే కేసులు ఎక్కడ నమోదు చేశారని ఆశ్యర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమ్యాయి. ఇందులో భాగంగానే కొవిడ్ నిబంధనలను అమలు చేశాయి. వాటిని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. అయితే కొందరు ప్రజలు వీటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. మాస్కులు పెట్టుకోకుండానే పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చారు. ఇటువంటి వారిపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝులిపించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలోనే 2021 ఏప్రిల్ 17 - 2022 ఏప్రిల్ 6 మధ్య కొవిడ్ నిబంధనలు పాటించని ప్రజలపై అక్కడి పోలీసులు 37,809 కేసులు నమోదు చేశారు. 



అంతేకాకుండా ఏకంగా రూ.154కోట్ల జరిమానాలు విధించారు. ప్రజలపై పోలీసులు జరిమానాలనైతే బాగానే వేశారు కానీ ప్రజలు మాత్రం వాటిని కూడా పట్టించుకోలేదు. ఈ క్రమంలో కేవలం అతికొద్ది మంది మాత్రమే ఫైన్ చెల్లించేందుకు ముందుకు రావడంతో రూ.16.79కోట్లు వసూలయ్యాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే.. 37,809 కేసుల్లో 37,803 కేసులు ఒక్క న్యూడిల్లీ జిల్లాలోనే నమోదవగా సౌత్ డిస్ట్రిక్ట్‌లో మరో ఐదు కేసులు.. వెస్ట్ డిస్ట్రిక్ట్‌లో ఒక కేసు నమోదైందట. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో కేవలం ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. ఇదిలా ఉంటే.. పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతున్న వేళ.. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించే ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం తాజాగా వెనక్కి తీసుకుంది. అయితే ప్రజలు మాత్రం మాస్క్ ధరించాల్సి ఉంటుందని సూచించింది.



Updated Date - 2022-04-09T20:58:15+05:30 IST