Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 4 2021 @ 20:55PM

స్కూటీ నంబర్ ప్లేట్‌పై 'సెక్స్' రవాణా శాఖకు మహిళా కమిషన్ నోటీసు

న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ రవాణా శాఖకు నోటీసులు జారీ చేసింది. ఎస్, ఈ, ఎక్స్ అక్షరాలు ఉన్న వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ రవాణా శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల స్కూటీని కొనుగోలు చేసిన ఓ అమ్మాయికి అలాట్‌మెంట్ సిరీస్ వచ్చింది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌లో 'సెక్స్' అనే అక్షరాలు ఉన్నాయని, దాని కారణంగా ఆమె వేధింపులకు గురవుతోంది. నంబర్ ప్లేట్ వల్ల తనను వెక్కిరిస్తున్నారని, ఆటపట్టిస్తున్నారని అమ్మాయి ఫిర్యాదు చేసింది. తనకు కేటాయించిన సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్ కారణంగా తనను తీవ్రంగా ఆటపట్టిస్తున్నారని, కించపరుస్తున్నారని అమ్మాయి కమిషన్‌కు తెలిపింది. రాకపోకలు సాగించడంతోపాటు అవసరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లలేకపోతున్నానని, ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెంటనే మార్చాలని కోరుతూ రవాణా శాఖకు కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రవాణా శాఖకు కమిషన్ 4 రోజుల సమయం ఇచ్చింది.

Advertisement
Advertisement