ఢిల్లీలో తగ్గుతున్న కరోనా.. ఈ రోజు 1800 దాకా..

ABN , First Publish Date - 2020-07-12T02:56:31+05:30 IST

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. ముఖ్యంగా కొత్త కేసులతో పోల్చితే కోలుకుంటున్న...

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా.. ఈ రోజు 1800 దాకా..

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. ముఖ్యంగా కొత్త కేసులతో పోల్చితే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కుగా ఉండడం హర్షించదగ్గ విషయం. దీంతో ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. ఈ రోజు 18వందల వరకు తాజా కేసులు బయపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా11వేలకు చేరువయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 మంది మరణించారు. 2,998 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,10,921కి చేరింది. వీరిలో 19,895మంది చికిత్స పొందుతుండగా 87,692మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 3.334మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-12T02:56:31+05:30 IST