ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం...ఆరుగురు గల్లంతు

ABN , First Publish Date - 2021-06-21T16:39:08+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఉద్యోగనగర్ లోని షూ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 8.22 గంటలకు ఘోర అగ్నిప్రమాదందేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఉద్యోగనగర్ లోని షూ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 8.22 గంటలకు ఘోర అగ్నిప్రమాదం...

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం...ఆరుగురు గల్లంతు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఉద్యోగనగర్ లోని షూ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 8.22 గంటలకు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షూ ఫ్యాక్టరీలో మంటలంటుకోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 31 వాహనాలతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు గల్లంతు అయ్యారని అధికారులు చెప్పారు. షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు కనిపించడం లేదని, వారి గురించి గాలిస్తున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టరు అతుల్ గార్గ్ చెప్పారు. మంటలను అగ్నిమాపక శాఖ వాహనాలతో అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. పోలీసులు సైతం సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.

Updated Date - 2021-06-21T16:39:08+05:30 IST