వలస కార్మికులకు విమాన టికెట్లు.. రైతు ఔదార్యం

ABN , First Publish Date - 2020-05-29T00:08:53+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో

వలస కార్మికులకు విమాన టికెట్లు.. రైతు ఔదార్యం

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు అండగా నిలుస్తున్నారు. అయితే ఢిల్లీలోని ఓ రైతు కూడా వలస కార్మికులకు ఊహించని సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. స్థానిక తిగిపూర్ గ్రామంలో పుట్టగొడుగులు పండిస్తున్న పప్పన్ సింగ్ అనే రైతు తన వద్ద పనిచేస్తున్న పది మంది వలస కార్మికులకు విమాన టికెట్లు అందించాడు.  ఢిల్లీ నుంచి బీహార్‌లోని వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు దాదాపు రూ.68వేల విలువైన టికెట్లను వారికి అందించాడు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.3000 చొప్పున నగదును కూడా అందించాడు. ఈ సందర్భంగా పప్పన్ సింగ్ మాట్లాడుతూ, ‘నా వద్ద పనిచేస్తున్న వారు అవస్థలు పడడం నాకిష్టం లేదు. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి సొంత ప్రాంతాలకు వెళ్లడం నేను భరించలేను. అందుకే వారికి నేను చేయగలిగిన సాయం చేశాను’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2020-05-29T00:08:53+05:30 IST