ముఖానికి మాస్క్ లేకుండా వీధుల్లోకి వస్తే జైలే

ABN , First Publish Date - 2020-04-09T22:23:07+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరిన్ని కఠిన

ముఖానికి మాస్క్ లేకుండా వీధుల్లోకి వస్తే జైలే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముఖానికి మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎటువంటి రక్షణ కవచాలు ధరించకుండా రోడ్డుపైకి వచ్చే వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు  చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా రూ. 1000 వరకు జరిమానా కూడా విధించనున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని సెక్షన్ 188 కింద శిక్షిస్తామని ఆయన వివరించారు. అది కార్యాలయమైనా, వర్క్‌షాప్ అయినా ఎక్కడైనా మాస్కులు ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. మాస్కులు ధరించకుండా అధికారులు మీటింగులు నిర్వహించకూడదని సూచించారు.  

Updated Date - 2020-04-09T22:23:07+05:30 IST