తొలి టైటిల్‌కు తహతహ

ABN , First Publish Date - 2020-09-17T08:55:56+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌.. గతంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌గా ఉండి, రెండు సీజన్ల కిందట క్యాపిటల్స్‌గా మారిన ఈ జట్టు మెగా టోర్నీలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు

తొలి టైటిల్‌కు తహతహ

ఢిల్లీ జట్టు 

స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయా స్‌ అయ్యర్‌, పృథ్వీ షా, రహానె, ధవన్‌, ఇషాంత్‌, అమిత్‌ మిశ్రా, అవేశ్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, అశ్విన్‌, పంత్‌, తుషార్‌ దేశ్‌పాండే.

విదేశీ ఆటగాళ్లు: హెట్‌ మయెర్‌, అలెక్స్‌ కేరీ, సందీప్‌ లామిచానె, అన్రిచ్‌ నోర్జ్‌, కీమో పాల్‌, రబాడ, డేనియల్‌ సామ్స్‌, మార్కస్‌ స్టొయినిస్‌.


ఐపీఎల్‌ ప్రదర్శన

2008 - నాలుగోస్థానం

2009, 2012, 2019-మూడోస్థానం


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఢిల్లీ క్యాపిటల్స్‌.. గతంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌గా ఉండి, రెండు సీజన్ల కిందట క్యాపిటల్స్‌గా మారిన ఈ జట్టు మెగా టోర్నీలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. రిటెన్షన్‌, వేలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే లీగ్‌లో ఢిల్లీ మెరుగైన ప్రదర్శన చేయకపోవడానికి కారణంగా చెబుతారు. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో ఈసారి ఆ జట్టు తమ రాతను మార్చుకోవాలని పట్టుదలగా ఉంది.  


బలం: శిఖర్‌ ధవన్‌, రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌.. ఇలా టీమిండియాలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్‌ బలీయంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా కలిగిన విండీస్‌ స్టార్‌ హెట్‌మయెర్‌ ఉండడం ఢిల్లీ బ్యాటింగ్‌కు అదనపు బలం. అశ్విన్‌ చేరికతో స్పిన్‌ విభాగం మరింత పటిష్ట మైంది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, సందీప్‌ లామి చానెతో ఇప్పటికే జట్టు స్పిన్‌ దుర్భేద్యంగా ఉంది. పేస్‌ బౌలిం గ్‌లో రబాడ జట్టు తురుపు ముక్క.


బలహీనత: ఇషాంత్‌ శర్మ, మోహిత్‌ శర్మ వంటి సీనియర్‌ పేసర్లు అందుబాటులో ఉన్నా.. వీరు తమ పేస్‌ అటాక్‌తో జట్టులో ఆత్మవిశ్వాసం నింపగలరా అన్నది ప్రశ్న. వరల్డ్‌ క్లాస్‌ ఆల్‌రౌండర్లు లేకపో వడం ఢిల్లీకి మైనస్‌. అక్షర్‌ పటేల్‌, స్టొయినిస్‌, కీమో పాల్‌, అశ్విన్‌ వంటి ఆల్‌రౌండర్లున్నా.. వారు చెప్పుకోతగ్గ స్కోర్లు చేయడంతోపాటు నాలుగు ఓవర్ల కోటాను సమర్థంగా పూర్తి చేస్తారా అన్నది డౌటే. మొత్తంగా అనుభవ జ్ఞులు, యువకులతో కూడిన ఢిల్లీ జట్టు పాంటింగ్‌ కోచింగ్‌లో ఈసారి తమ రికార్డును తిరగరాయాలని పట్టుదలగా ఉంది.

Updated Date - 2020-09-17T08:55:56+05:30 IST