Salman Khurshid పుస్తకాన్ని నిలిపివేయలేం...ఢిల్లీ కోర్టు స్పష్టం

ABN , First Publish Date - 2021-11-18T15:46:56+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పుస్తక ప్రచురణ, సర్క్యులేషన్, అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో ఢిల్లీ కోర్టు నిరాకరించింది...

Salman Khurshid పుస్తకాన్ని నిలిపివేయలేం...ఢిల్లీ కోర్టు స్పష్టం

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పుస్తక ప్రచురణ, సర్క్యులేషన్, అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తమ మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణతో ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య’ పుస్తక ప్రచురణ, సర్క్యులేషన్ అమ్మకాలను నిలిపివేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంలో కోరారు.ఈ పుస్తకం అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో ఎక్స్-పార్ట్ ఇంజక్షన్ ఇవ్వడానికి డిల్లీ కోర్టు నిరాకరించింది. పుస్తకం రాసే, ప్రచురించే హక్కు రచయిత, ప్రచురణకర్తకు ఉందని కోర్టు పేర్కొంది. 


ఈ పుస్తకంపై నిషేధం భావవ్యక్తీకరణ హక్కుకు భంగం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.పిటిషన్ దారు పుస్తకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చని, తన మనోభావాలను దెబ్బతీసినవని ఆరోపించిన పేరాలపై ఖండనను కూడా ప్రచురించవచ్చని కోర్టు పేర్కొంది.ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుస్తకావిష్కరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మైనారిటీల ఓట్లను పొందడం లక్ష్యంగా పెట్టుకున్నారని పిటిషన్ లో హిందూసేన పేర్కొంది.


Updated Date - 2021-11-18T15:46:56+05:30 IST