బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్.. అరీజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ABN , First Publish Date - 2021-03-09T00:41:44+05:30 IST

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్న అరీజ్ ఖాన్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్.. అరీజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ:  బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్న అరీజ్ ఖాన్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను బట్టి నిందితుడే దోషి అని స్పష్టమైందని కోర్టు వ్యాఖ్యానించింది. సెప్టెంబరు 2008లో దేశ రాజధానిలో జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరగ్గా ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మను అరీజ్ ఖాన్ హత్య చేశాడు. షూటవుట్ నుంచి తప్పించుకున్న అరీజ్ ఖాన్ ప్రకటించినట్టుగా కోర్టు ఎదుట హాజరు కావడంలో విఫలమయ్యాడు. భారత శిక్షా స్మృతిలోని 186, 333, 353, 302, 307, 174A, 34 సెక్షన్ల కింది నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. అరీజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఈ నెల 15న శిక్ష విధించనుంది. 


ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉగ్రవాదులకు మధ్య దక్షిణ ఢిల్లీలోని బాట్లా హౌస్‌లోని ఫ్లాట్ (ఎల్-18)లో 19 సెప్టెంబరు 2008లో ఎన్‌కౌంటర్ జరిగింది. దేశ రాజధానిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 26 మంది చనిపోయిన ఆరు రోజుల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్ శర్మ, ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 


జులై 2013లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు ట్రయల్ కోర్టు జీవిత శిక్ష విధించింది. ఈ తీర్పును అతడు హైకోర్టులో సవాలు చేయగా, ప్రస్తుతం పెండింగులో ఉంది. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని పరారైన అరీజ్‌ ఫిబ్రవరి 2018లో నేపాల్‌‌లో అరెస్టయ్యాడు. 

Updated Date - 2021-03-09T00:41:44+05:30 IST