రాజస్థాన్ Ministers Son కోసం ఢిల్లీ పోలీసుల వేట.. ఉదయం నుంచి..

ABN , First Publish Date - 2022-05-15T18:01:51+05:30 IST

జైపూర్ : Rape case లో నిందితుడైన రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కొడుకు రోహిత్‌ను అరెస్ట్ చేసేందుకు 15 మంది సభ్యుల ఢిల్లీ పోలీస్ బృందం ఆదివారం ఉదయమే

రాజస్థాన్ Ministers Son కోసం ఢిల్లీ పోలీసుల వేట.. ఉదయం నుంచి..

జైపూర్ : అత్యాచార కేసులో ( Rape case ) నిందితుడిగా  ఉన్న రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కొడుకు రోహిత్‌ జోషిని అరెస్ట్ చేసేందుకు 15 మంది సభ్యుల ఢిల్లీ పోలీస్ బృందం ఆదివారం ఉదయమే  జైపూర్ నగరం చేరుకుంది. నగరంలోని మంత్రికి చెందిన  రెండు నివాస ప్రాంగణాల్లో అన్వేషించినా నిందితుడి ఆచూకీ దొరకలేదని పోలీసులు వివరించారు. ఎక్కడున్నాడో గాలిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వివరించారు. కాగా నిందితుడి ఇంటికి పోలీసు నోటీసు అంటించి వెళ్లారు.


కాగా గతేడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య నిందితుడు రోహిత్ జోషి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ ఇటివల ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని వంచించాడని బాధితురాలు వాపోయింది. తనను కిడ్నాప్ చేయడంతోపాటు బ్లాక్ మెయిలింగ్‌కు కూడా పాల్పడ్డాడని వివరించింది. తాను గర్భవతిననే విషయం ఆగస్టు 2021లో  తెలిసిందని, గర్భస్రావం మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. కానీ తాను తీసుకోలేదని వివరించింది. అయితే తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌గా మార్చారు. దర్యాప్తునకు రంగంలోకి దిగారు. కాగా రాజస్థాన్ ప్రభుత్వం నిందితుడిని దాచిపెట్టిందని అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

Updated Date - 2022-05-15T18:01:51+05:30 IST